మదనపల్లి (కురబలకోట) : యోగాను తాత్కాలిక కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని.. అప్పుడే ఆరోగ్య యోగం దక్కుతుందని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో యోగాభ్యసనాల కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా గురువు డాక్టర్ పాల్ బ్రహ్మకుమార్ యోగాసనాలు చేయించారు. యోగా ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది అని ఎస్పీ అన్నారు. దీనిని అలవాటుగా చేసుకుని ఆరోగ్య సమాజ నిర్మాణానికి తోడ్ప డాలని కోరారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


