వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో అండర్ 16 బాలుర మల్టీడే క్రికెట్ అంతర్ జిల్లా పోటీలు హోరాహోరీగా సాగాయి. శనివారం కర్నూలు క్రికెట్ జట్టుపై 78 పరుగుల తేడాతో ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ జట్టు విజయం సొంతం చేసుకుంది. అంతకు ముందు గ్రౌండ్ 1లో జరిగిన కడప, నెల్లూరు క్రికెట్ టీంలు తలపడ్డాయి. కడప జట్టు 97 ఓవర్లలో 364 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 40.4 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత ఫాలో ఆన్‌లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 64.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కడప జిల్లా జట్టు 63 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే గ్రౌండ్ 2లో జరిగిన ఇన్నింగ్స్‌లో చిత్తూరు, కర్నూలు జిల్లా క్రికెట్ జట్లు తలపడ్డాయి. కర్నూలు క్రికెట్ జట్టు 82.1 ఓవర్లలో 342 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 114.3 ఓవర్లలో 595 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 51.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో చిత్తూరు జిల్లా క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ 78 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో విజయ్, సతీష్ యాదవ్, శ్రీధర్ కుమార్, సునీల్ కుమార్, ప్రసన్న కుమార్, జవహర్‌బాష, హరీష్, రెడ్డిగిరీష్ తదితరులు పాల్గొన్నారు.


