క్లుప్తంగా
స్కోర్ వివరాలు..
● జ్ఞానేశ్వర్ ‘కెప్టెన్’ ఇన్నింగ్స్
● సాయిశ్రవణ్ హాఫ్ సెంచరీ వృథా
కడప వైఎస్సార్ సర్కిల్: కడప వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం మధ్యాహ్నం జరిగిన ఏపీఎల్ రసవత్తర పోరులో తుంగభద్ర వారియర్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి ఘన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన తుంగభద్ర వారియర్స్ కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ మొదట బౌలింగ్ ఎంచుకుని భీమవరం బుల్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
సాయి శ్రవణ్ హాఫ్ సెంచరీ
భీమవరం బుల్స్ బ్యాటింగ్ ప్రదర్శన మోస్తరుగా సాగింది. తుంగభద్ర వారియర్స్ కట్టడి బౌలింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో భీమవరం జట్టు 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్ సెంచరీ హీరో రేవంత్ రెడ్డి (17), కెప్టెన్ హేమంత్ రెడ్డి (13)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ క్లిష్ట సమయంలో వన్‌డౌన్ బ్యాటర్ టి.వి. సాయి శ్రవణ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లు మోపాడ రవికిరణ్ (5), బెందలం సాత్విక్ (15)లు విఫలమైనా.. లోయర్ ఆర్డర్‌లో వచ్చిన బి. మునీష్ వర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో భీమవరం గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తుంగభద్ర వారియర్స్ బౌలర్లలో ఎన్.సాయి చరణ్ పదునైన బౌలింగ్‌తో భీమవరం బ్యాటర్లను వణికించి 3 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న సౌరభ్ కుమార్ సైతం 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసి పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు.
జ్ఞానేశ్వర్, సూర్య జయంత్‌ల
వీరవిహారం!
లక్ష్య చేధనలో తుంగభద్ర వారియర్స్ ఓపెనర్ సమన్యు దత్తా (1) త్వరగానే అవుట్ అయినా.. వన్ డౌన్‌లో వచ్చిన గుట్టా రోహిత్ (9) సిక్సర్‌తో పర్వాలేదనిపించాడు. అయితే, మరో ఓపెనర్ అయిన కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ మాత్రం క్రీజులో పాతుకుపోయి 56 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 75 పరుగులు సాధించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. మిడిలార్డర్‌లో కాకి సూర్య జయంత్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి గట్టి సహకారాన్ని అందించాడు. ఆఖర్లో ఆనంద్ జోసియా (13 నాటౌట్) విక్టరీ లైన్ దాటించాడు. భీమవరం బౌలర్లలో చెన్నుపాటి రవి తేజ 3 వికెట్లు తీసినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.
భీమవరం బుల్స్ ఇన్నింగ్స్: కె. రేవంత్ రెడ్డి(సి) శ్రీ సమన్యు దత్తా (బి) సౌరభ్ కుమార్(17 పరుగులు 15 బంతుల్లో), ఎమ్.హేమంత్ రెడ్డి ( ఛి)(సి) కాకి సూర్య జయంత్ (బి) గవ్వల మల్లికార్జున – 13 (10), టి.వి. సాయి శ్రవణ్(సి) కాకి సూర్య జయంత్ (బి) మాధా దీపక్– 50(32), మోపాడ రవికిరణ్(బి) సౌరభ్ కుమార్– 5(9), బెందలం సాత్విక్(సి) గవ్వల మల్లికార్జున (బి) ఎన్.సాయి చరణ్– 15 (18), ఎమ్. ధీరజ్ కుమార్ (ఎల్‌బీడబ్యు) (బి) ఎన్.సాయి చరణ్–1 (2), బి.మునీష్ వర్మ నాటౌట్–35 (21), కేవీ కశ్యప్ ప్రకాష్(సి) గవ్వల మల్లికార్జున (బి) చీపురపల్లి స్టీఫెన్– 6 (2), చల్లారపు శివ(సి) కంచెర్ల ఆనంద్ జోసియా (బి) ఎన్.సాయి చరణ్–1 (2), సత్యనారాయణ రాజు రనౌట్ (చీపురపల్లి స్టీఫెన్)–1 (1), బైలపూడి యశ్వంత్ నాటౌట్–5 (8), ఎక్స్‌ట్రాలు: 04
మొత్తం స్కోరు: 153/9 (20 ఓవర్లు)
తుంగభద్ర వారియర్స్ ఇన్నింగ్స్ (ఛేజింగ్):
సి.ఆర్.జ్ఞానేశ్వర్ (c)(¼) ^ðl¯]l$²´ësìæ Æý‡Ñ ™ólf&75 (56), } çÜÐ]l$¯]l$Å §ýl™èl¢า) & (¼) ^ðl¯]l$²-´ësìæ Æý‡Ñ ™ólf&1 (2), VýS$sêt Æøíßæ-™Œæ(íÜ) çÜ™èlÅ-¯éÆ>Ķæ$׿ Æ>k (¼) O»ñæÌSç³Nyìl Ķæ$ÔèæÓ…™Œæ&9 (8), M>MìS çÜ*Æý‡Å fĶæ$…-™Œæ(íÜ) »ñæ…§ýlÌS… Ýë†ÓMŠS (¼) ^ðl¯]l$²-´ësìæ Æý‡Ñ ™ólf&46 (33), MýS…^ðlÆý‡Ï B¯]l…§Šæ gZíÜĶæ* ¯ésosŒæ&13 (8), ^èlÆý‡-׊æh™Œæ h.Ñ.-¯é-sosŒæ&1 (1), ఎక్స్‌టాలు: 09 మొత్తం స్కోరు: 154/4 (18.0 ఓవర్లు)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సి.ఆర్. జ్ఞానేశ్వర్ (తుంగభద్ర వారియర్స్) – 75 పరుగులు.


