మదనపల్లె టౌన్ : వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకే మోసం చేశాడని నీరుగట్టువారి పల్లికి చెందిన సాలమ్మ (70) ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్లబోసుకున్నారు. తన కుమారుడు కప్పల రామచంద్ర జీవితాంతం ఏ లోటు రాకుండా సాకుతానని నమ్మించి తన వద్ద ఉన్న నగదు, బంగారాన్ని తీసుకున్నాడని, ఆ తర్వాత తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతే కాకుండా తన ఆస్తులు, బంగారం, డబ్బులు కొడుకుపై నమ్మకంతో ఇచ్చానని, అవి ఇప్పుడు తిరిగి ఇవ్వనని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ‘దేవరా... నాకు న్యాయం చేయండి‘ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధాప్యం లో తనకు జీవనోపాధి కష్టంగా మారిందని, ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
రైతుపై కత్తితో దాడి
మదనపల్లె టౌన్ : పాత వివాదాల నేపథ్యంలో అర్ధరాత్రి వేళ రైతుపై తన ప్రత్యర్థి కత్తితో దాడి చేసిన సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం, అంగళ్లు గ్రామం తుంగవారిపల్లెకు చెందిన రైతు జె. హరిప్రసాద్ (26) అంగళ్లు టమోటా మార్కెట్ నుంచి టమాట అమ్మకాలు ముగించుకొని ట్రాక్టర్‌లో ఇంటికి వస్తుండగా ఊరికి సమీపంలోని చెరువు కట్టపై అదే గ్రామానికి చెందిన తన ప్రత్యర్థి ప్రసాద్, అతని అనుచరులు ట్రాక్టర్‌ని ఆపి గొడవ చేశారు. మాట మాట పెరిగి ముందుగానే వెంట తెచ్చుకున్న కత్తితో రైతు హరిప్రసాద్‌పై దాడి చేశాడు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన హరిప్రసాద్‌ను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
గంజాయి కేసులో మరో నిందితుడు అరెస్టు
పెద్దతిప్పసముద్రం : అక్రమంగా గంజా యిని తరలిస్తున్న కేసులో మరో నిందితుడిని శనివారం అరె స్టు చేసినట్లు ఎస్‌ఐ పరమేశ్ నాయక్ తెలిపారు. గతేడాది నమోదైన గంజాయి కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న మదనపల్లికి చెందిన చల్లా తేజ్ కుమార్ (23) మండలంలోని బూర్లపల్లి క్రాస్ వద్ద ఉండగా అరెస్టు చేశామన్నారు. తనిఖీలో రెండు కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ వెల్లడించారు.
కుక్క దాడిలో బాలుడికి గాయాలు
మదనపల్లె టౌన్ : కుక్క దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం నిమ్మనపల్లి మండలంలో జరిగింది. మండలంలోని రాచవేటి వారి పల్లె పంచాయతీ, గుండ్ల బురుజుకు చెందిన దంపతులు విజయ్ కుమార్ కవితల కుమారుడు కుందన్(7) వీధిలో బంతాట ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుక్క బాలుడి మొహం మీద కరచి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబీకులు గమనించి బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
నకిలీ మద్యం కేసులో విచారణ
ములకలచెరువు : ములకలచెరువు నకిలో మద్యం కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నుంచి బహిష్కరించిన దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్ రెడ్డిని శనివారం మదనపల్లె ఎకై ్సజ్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఎనిమిది నెలల క్రితం వెలుగుచూసిన నకిలీ మద్యం వ్యవహారం వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు పత్రికల్లో రావడంతో కూటమి ప్రభుత్వం వీరిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.తాజాగా వీరు విదేశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని ఎకై ్సజ్ అధికారులు విచారించారు. సుమారు 6 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు కేసుకు సంబంధించి నిజానిజాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
తల్లి సాలమ్మ ఆవేదన


