క్యాపిటల్‌ను మట్టికరిపించిన కింగ్స్‌ | - | Sakshi
Sakshi News home page

క్యాపిటల్‌ను మట్టికరిపించిన కింగ్స్‌

Jun 21 2026 5:28 AM | Updated on Jun 21 2026 5:28 AM

క్యాపిటల్‌ను మట్టికరిపించిన కింగ్స్‌

స్కోర్‌ వివరాలు..

డప వైఎస్‌ రాజారెడ్డి స్టేడియం వేదికగా జరిగిన ఏపీఎల్‌ సీజన్‌–5 సమరంలో కాకినాడ కింగ్స్‌ సర్వశ్రేష్ఠ ప్రదర్శనతో క్యాపిటల్‌ అమరావతి రాయల్స్‌ను 120 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కాకినాడ కింగ్స్‌ జట్టు ఆరంభంలో ఓపెనర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ (1) వికెట్‌ కోల్పోయినప్పటికీ, ఆ ఒత్తిడిని ఏమాత్రం క్షేత్రస్థాయిలోకి రానివ్వకుండా బ్యాటింగ్‌ పవర్‌ హౌస్‌లా విరుచుకుపడింది. ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి (57), మిట్టా లేఖాజ్‌ రెడ్డి (53)లు విధ్వంసకర అర్థశతకాలతో చెలరేగగా, కెప్టెన్‌ మనీష్‌ గొలమారు (33), పిన్నింటి తపస్వి (41)లు సిక్సర్ల వర్షం కురిపించడంతో కాకినాడ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగుల హిమాలయ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది. అనంతరం 226 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్‌ జట్టుకు రన్‌ రేట్‌ ఒత్తిడి ఆరంభం నుంచే శాపంగా మారింది. కాకినాడ పేసర్లు హరిశంకర్‌ రెడ్డి, కావూరి సాయితేజలు పవర్‌ప్లేలోనే టాప్‌ ఆర్డర్‌ వెన్ను విరవడంతో అమరావతి బ్యాటింగ్‌ లైన్‌ పూర్తిగా కుప్పకూలింది. మిడిలార్డర్‌లో ఎస్‌. దుర్గా వరప్రసాద్‌ (13 బంతుల్లో 30) ఒక్కడే వేగంగా ఆడి ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మరోవైపు కరణ్‌ షిండే (4), కేవీ శశికాంత్‌ (11) లాంటి లీగ్‌ సీనియర్లు కనీస పోటీ ఇవ్వకుండా ఘోరంగా వైఫల్యం చెందారు. కాకినాడ స్పిన్నర్‌ సిరపారపు ఆశిష్‌ కేవలం 13 పరుగులకే 4 వికెట్లు (4/13) పడగొట్టి అమరావతి టెయిల్‌ ఎండర్లను క్లీన్‌ చేయడంతో, ఆ జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే 105 పరుగులకే ఆలౌట్‌ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాకినాడ కింగ్స్‌ తరఫున ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మిట్లా లేఖాజ్‌రెడ్డి ఆఖరి ఓవర్లలో రన్‌ రేట్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లినందున ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును గెలుచుకున్నారు.

కాకినాడ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ : పిట్టా అర్జున్‌ టెండూల్కర్‌ (రనౌట్‌–యశ్వంత్‌ గొల్లపూడి) (2 బంతుల్లో 1), మనీష్‌ గొలమారు (సి) ఎస్‌. దుర్గ వరాప్రసాద్‌ (బి) బండారు అయ్యప్ప (16 బంతుల్లో 33), అభిషేక్‌ రెడ్డి (బి) తలచిట్ల దీపు భార్గవ్‌ (38 బంతుల్లో 57), పిన్నింటి తపస్వి (సి) శీరం వెంకట రాహుల్‌ (బి) బండారు అయ్యప్ప (26 బంతుల్లో 41), మిట్టా లేఖాజ్‌ రెడ్డి (సి) వరుణ్‌ సాత్విక్‌ (బి) కేవీ శశికాంత్‌ (30 బంతుల్లో 53), మువ్వల యువన్‌ (నాటౌట్‌) (11 బంతుల్లో 25), గద్దె సమన్విత్‌ (నాటౌట్‌) (1 బంతుల్లో 0) మొత్తం స్కోరు: 225/5, ఓవర్లు: 20.0, ఎక్స్‌ట్రాలు: 15

క్యాపిటల్‌ అమరావతి రాయల్స్‌ ఇన్నింగ్స్‌ యారా సందీప్‌ (సి) గద్దె సమన్విత్‌ (బి) హరిశంకర్‌ రెడ్డి (11 బంతుల్లో 13), శీరం వెంకట రాహుల్‌ (బి) కావూరి సాయితేజ (8 బంతుల్లో 11), వరుణ్‌ సాత్విక్‌ (ఎల్‌బీడబ్ల్యు) (బి) సిరపారపు ఆశిష్‌ (2 బంతుల్లో 0), కరణ్‌ షిండే (సి) వి.గిరి ప్రసాద్‌ (బి) కావూరి సాయితేజ (3 బంతుల్లో 4), పైలా అవినాష్‌ (సి) పిన్నింటి తపస్వి (బి) వి.గిరి ప్రసాద్‌ (11 బంతుల్లో 6), ఎస్‌.దుర్గవరప్రసాద్‌ (బి) పిన్నింటి తపస్వి (13 బంతుల్లో 30), కేవీ శశికాంత్‌ (సి) గద్దె సమన్విత్‌ (బి) వి.గిరి ప్రసాద్‌ (7 బంతుల్లో 11), ఉద్దరాజు అహితేష్‌ వర్మ (సి) గద్దె సమన్విత్‌ (బి) సిరపారపు ఆశిష్‌ (6 బంతుల్లో 15), బండారు అయ్యప్ప (సి) అభిషేక్‌ రెడ్డి (బి) సిరపారపు ఆశిష్‌ (6 బంతుల్లో 9), తలచిట్ల దీపు భార్గవ్‌ (సి) గద్దె సమన్విత్‌ (బి) సిరపారపు ఆశిష్‌ (1 బంతుల్లో 0), ఎమ్‌.తోషిత్‌ యాదవ్‌ (నాటౌట్‌) (5 బంతుల్లో 2) మొత్తం స్కోరు: 105/10,

ఓవర్లు: 12.1, ఎక్స్‌ట్రాలు: 04

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement