23 నుంచి స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశానికి పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

23 నుంచి స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశానికి పరీక్షలు

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

నేడు కడపలో జాబ్‌మేళా

మదనపల్లె సిటీ: డాక్టర్‌ వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలకు ఈనెల 23,24 తేదీల్లో జిల్లా స్థాయి ఎంపిక పరీక్షలు జరుగుతాయని డీఎస్‌డీఓ చంద్రశేఖర్‌ తెలిపారు. స్థానిక బీటీ కాలేజీ క్రీడామైదానంలో ఉదయం 7 గంటలకు హాజరుకావాలన్నారు. ఎంపిక పరీక్షల్లో ఎత్తు, బరువు,30 మీటర్ల పరుగుపందెం, వెర్టికల్‌ జంప్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌జంప్‌, మెడిసిన్‌బాల్‌త్రో, షటిల్‌రన్‌, ఫార్వర్డ్‌ బెండ్‌ అండ్‌ రీచ్‌, 800 మీటర్ల పరుగుపందెం వంటి మోటార్‌ ఎబిలీటీ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు జనన ధృవీకరణపత్రం, స్టడీ సర్టిఫికెట్‌, కులం, ఆదాయం, స్థానికత ధృవీకరణపత్రాల ఒరిజనల్స్‌ తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.

పది ఫలితాల్లో

91.28 ఉత్తీర్ణత

మదనపల్లె సిటీ: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో 91.28 ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ప్రకటించారు. జిల్లాలో 2994 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 1882, బాలికలు 1112 మంది పరీక్షలకు హాజరయ్యారు. బాలురు 1693 మంది, బాలికలు 1037 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 11వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున ఈనెల 20 నుంచి 26వ తేదీలోపు చెల్లించాలని ఆయన తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

పుంగనూరు : రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీలకు స్థానిక అడవినాథునికుంట మోడల్‌స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ రమ తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మోడల్‌స్కూల్‌ విద్యార్థులు షేక్‌ మయీన్‌తాజ్‌, డి.ఉషశ్రీలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. వీరికి గైడ్‌గా టీచర్లుగా మనోహర్‌నాయక్‌, తనూజ వ్యవహరించారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సైస్స్‌ఫేర్‌ ఆఫీసర్‌ మోహన్‌సింగ్‌ వారిని అభినందించారు.

హోరాహోరీగా

అంతర్‌ జిల్లా క్రికెట్‌ పోటీలు

వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడామైదానంలో ఏసీఏ సౌత్‌ జోన్‌ అండర్‌ 16 బాలుర మల్టిడే క్రికెట్‌ అంతర్‌ జిల్లాల పోటీలు హోరాహోరీగా సాగాయి. శుక్రవారం గ్రౌండ్‌ –1లో కడప, నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కడప జట్టు 364 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన నెల్లూరు జట్టు 128 పరుగులు చేసి ఆలౌటైంది. గ్రౌండ్‌– 2లో జరిగిన చిత్తూరు, కర్నూలు మ్యాచ్‌లో కర్నూల్‌ జట్టు 342 పరుగులు చేయగా... చిత్తూరు జట్టు 511 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తున్నట్లు కోచ్‌ సునీల్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్‌, సతీష్‌యాదవ్‌, శ్రీధర్‌ కుమార్‌, జవహర్‌ బాష, హరీష్‌, తదితరులు పాల్గొన్నారు.

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధికల్పనాధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అందెల సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అలాగే టయోవిజన్‌ కాంపోజిటివ్‌ టెక్నాలజీ సంస్థలో ప్రొడక్షన్‌, క్వాలిటీ ఇంజినీర్లు, క్యూఎంఎస్‌ ఇంజినీర్‌ తదితర ఉద్యోగాలకు డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అల్‌డిక్సన్‌ కంపెనీలో వివిధ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ వరకు, ఐటీఐ డిప్లొమా అర్హత గల అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు.

నేటినుంచి కేవీకేలో శిక్షణ

కడప ఎడ్యుకేషన్‌: కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వానపాముల ఎరువు తయారీపై ఈ నెల 20 నుంచి 22 వరకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని కేవీకే అధిపతి డాక్టర్‌ శిల్పళక ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల రైతులు, యువత 8096888039 నంబర్‌కు ఫోన్‌ చేసి పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

మయీన్‌తాజ్‌ ఉషశ్రీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement