శారీరక,మానసిక ఆరోగ్యానికి యోగా | - | Sakshi
Sakshi News home page

శారీరక,మానసిక ఆరోగ్యానికి యోగా

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

రాయచోటి: శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా దోహదపడుతుందని డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మడితాటి నరసింహారెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026ను పురస్కరించుకొని రాయచోటి డైట్‌లో అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాలకు చెందిన ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ఆరోగ్యానికి యోగా అనే అంశంపై ఈనెల 18న పోస్టర్‌ తయారీ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలను శుక్రవారం డైట్‌లో ప్రకటించారు. అన్నమయ్య జిల్లా నుంచి బి శశికల (పదోతరగతి, ఏపీ మోడల్‌ స్కూల్‌, చిన్నమండెం) ప్రథమ, డి అలేఖ్య (9వ తరగతి, జడ్పీ హైస్కూల్‌, కె రామాపురం, రాయచోటి మండలం) ద్వితీయ, పి యోజిత్‌ శ్రీ నందన్‌ (8వ తరగతి,జడ్పీ హైస్కూ ల్‌, గాలివీడు మండలం) తృతీయ స్థానాలు సాధించారు. వైఎస్సార్‌ కడప జిల్లా నుంజి ఎం సుశాంత్‌ (9వ తరగతి, జెడ్పీ హైస్కూల్‌,ఉప్పలవాండ్లపల్లి,చక్రాయపేట మండలం) ప్రథమ, వి చందు (9వ తరగతి కార్పోరేషన్‌ హైస్కూల్‌, గాంధీనగర్‌, కడప) ద్వితీయ, కె మానస (8వ తరగతి, జడ్పీ గర్‌ల్స్‌, జయనగర్‌ కాలనీ, కడప) తృతీయ స్థానాలు సాధించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న విజేతలకు మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేస్తామని నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ కె సుబ్రమణ్యం విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డైట్‌ అధ్యాపకులు రెడ్డప్పరెడ్డి, యుగంధర్‌, ఓబుల్‌ రెడ్డి, శివప్రసాద్‌, ఇలియాస్‌, ఉపాధ్యాయులు రాజేశ్వరీ, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement