స్కోర్ వివరాలు..
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్–5 సమరంలో భాగంగా కడప నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో మూడో రోజు జరిగిన తొలి మ్యాచ్‌లో భీమవరం బుల్స్ జట్టు సంచలన విజయంతో దూసుకుపోయింది. విజయవాడ సన్‌షైనర్స్‌తో జరిగిన ఈ హై–స్కోరింగ్ థ్రిల్లర్‌లో భీమవరం బుల్స్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి ఘన విజయాన్ని సాధించారు. టాస్ గెలిచిన భీమవరం బుల్స్ కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
అశ్విన్ హెబ్బార్ ధమాకా..
విజయవాడ భారీ స్కోరు!
తొలుత బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ సన్‌షైనర్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని అందించారు. లీగ్ స్టార్ అశ్విన్ హెబ్బార్ మైదానంలో విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 73 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికే 124 పరుగులు చేసిన విజయవాడ జట్టులో, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జహీర్ అబ్బాస్ (25 బంతుల్లో 48, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్షవర్ధన్ (23 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ధాటిగా ఆడారు. అయితే ఆఖరి ఓవర్లలో భీమవరం బౌలర్లు పీవీఎస్‌ఎన్ రాజు (3 వికెట్లు), సీహెచ్ రవితేజ, బి.యశ్వంత్ (తలో రెండు వికెట్లు) లు అద్భుతంగా కట్టడి చేయడంతో విజయవాడ సన్‌షైనర్స్ జోరు తగ్గింది. అయినా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
రేవంత్ రెడ్డి విధ్వంసకర శతకం..
17.3 ఓవర్లలోనే ఫినిష్!
అనంతరం 213 పరుగుల హిమాలయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భీమవరం బుల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హేమంత్‌రెడ్డి త్వరగానే అవుట్ కాగా, మరొక ఎండ్‌లో క్రీజులోకి వచ్చిన రేవంత్ రెడ్డి కడప మైదానాన్ని తన సిక్సర్లతో హోరెత్తించాడు. విజయవాడ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఏకంగా 61 బంతుల్లో 14 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 126 పరుగులు చేసి సంచలన సెంచరీ సునామీ సృష్టించాడు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రవికిరణ్ కూడా వేగంగా ఆడుతూ 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును విజయ తీరాల వైపు నడిపించాడు. వీరిద్దరి వీరవిహారంతో భీమవరం బుల్స్ జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 17.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మైదానాన్ని ఉర్రూతలూగించిన భీమవరం బుల్స్ బ్యాటర్ రేవంత్‌రెడ్డి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
రేవంత్‌రెడ్డి
(126),
భీమవరం బుల్స్
61 బంతుల్లోనే 126 పరుగులతో
రేవంత్ రెడ్డి వీరవిహారం
అశ్విన్ హెబ్బార్(73) మెరుపులు వృథా
213 పరుగుల భారీ లక్ష్యాన్ని
17.3 ఓవర్లలోనే ఊదేసిన భీమవరం
పీవీఎస్‌ఎన్ రాజు మూడువికెట్ల పంజా
రసవత్తర పోరులో
భీమవరం సరికొత్త రికార్డు
ఉర్రూతలూగిన కడప స్టేడియం
విజయవాడ సన్ షైనర్స్ ఇన్నింగ్స్ : అభినవ్ (సి)మునీష్ (బి) పీవీఎస్‌ఎన్ రాజు (18 బంతుల్లో 26), అశ్విన్ హెబ్బర్ (సి)హేమంత్ (బి) యశ్వంత్ (73 బంతుల్లో 29), హర్షవర్దన్ (సి)సాత్విక్ (బి) శ్రావణ్ (18 బంతుల్లో 26), షేక్ జహీర్ అబ్బాస్ (సి)హేమంత్ (బి)రాజు (25 బంతుల్లో 48), పాండురంగరాజు (సి)రాజు (బి) యశ్వంత్ (11 బంతుల్లో 19), సిద్దార్థ (సి) హేమంత్ (బి)రవితేజ (2 బంతుల్లో 1), ఏవీవీ విజయ్ (సి)హేమంత్ (బి) రాజు ( 03 బంతుల్లో 06),ప్రశాంత్ (సి) రవి కిరణ్ (బి) రవితేజ(3 బంతుల్లో 2), జీఎస్‌వీ సుమిత్ (రనౌట్–రవికిరణ్, రాజు)(2 బంతుల్లో 1), లలిత్‌మోహన్ (నాటౌట్) (2 బంతుల్లో 2)భరత్ (నాటౌట్) 00
మొత్తం స్కోరు : 212/9 ఓవర్లు 20, ఎక్స్‌ట్రాలు : 04
బీమవరం బుల్స్ ఇన్నింగ్స్ : హేమంత్‌రెడ్డి (సి)ప్రశాంత్ (బి) సుమిత్ (6 బంతుల్లో 9), రేవంత్‌రెడ్డి (నాటౌట్) (61 బంతుల్లో 126), సాయిశ్రావణ్ (సి) శంబు అఖిల్ (డి)సుమిత్ (9 బంతుల్లో 19), రవికిరణ్ రటౌట్ ((సబ్) పిన్నింటి తేజస్వి / తన్నీరు భరత్) (24 బంతుల్లో 46), సాత్విక్ (నాటౌట్) (6 బంతుల్లో 14)
మొత్తం స్కోరు : 218/3 ఓవర్లు 17.3,
ఎక్స్‌ట్రాలు : 04


