మదనపల్లె టౌన్: నకిలీ బంగారు పూసల దండ చూపించి అమాయక ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్న ముఠా గుట్టును మదనపల్లె 2టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి నకిలీ బంగారం, కత్తులు, కారు స్వాధీనం చేసు కున్నారు. డీఎస్పీ పావని కథనం మేరకు అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, వీర బల్లి మండలాలకు చెందిన ఏడుగురు వ్యక్తు లు ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.
ఎలా మోసం చేశారంటే...
తమ పొలంలో జేసీబీతో పని చేస్తున్న సమయంలో బంగారం దొరికినట్లు నమ్మించి, నకిలీ బంగారు పూసల దండలను అసలు బంగారంగా చూపించి తక్కువ ధరకు ఇస్తామని చెప్పి బాధితులను నమ్మించి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారరు. ఈ నెల 10న బాధితులకు ఫోన్ చేసి భూమిలో దొరికిన సుమారు 3 కిలోల బంగారు పూసల దండ తమ వద్ద ఉందని, డబ్బులు అవసరమని, తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికారని చెప్పారు. బాధితులు డబ్బులతో మదనపల్లెకు రాగా, 17న స్థానిక అన్నమయ్య సర్కిల్ సమీపంలో వారిని కలుసుకొని నకిలీ బంగారు పూసల దండ చూపించి, అనంతరం హైవే వైపు ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి కత్తులు చూపించి బెదిరించి నగదు తీసుకున్నారని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా 19న ఉదయం 9:20 గంటలకు మదనపల్లె– రాయచోటి జాతీయ రహదారి సమీపంలోని అన్నమయ్య సర్కిల్ నుంచి హైవే వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన టయోటా ఇన్నోవా కారును ఆపి తనిఖీ చేసి అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించారన్నారు. నిందితుల వద్ద సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అరైస్టెన వారి వివరాలు:
పుంగనూరు మండలం, పాలెంపల్లి పంచాయతీ, జై నగర్ కాలనీకి చెందిన రాన్న చరణ్(19), ఎం.వినోద్ కుమార్(29), ఎం. రూక్ జాన్ రూపన్(35), వీరబల్లి మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ, పికారిపాలెంకు చెందిన రాన్న మల్లన్న(46), శోమల్ చలపతి(70), రాణ కృష్ణబాబు(22), మల్లి, పికారిపాలెం గ్రామం, వీరబల్లి మండలం, రాన్న పండి(46), జై నగర్ కాలనీ, పాలెంపల్లి, పుంగనూరు మండలాలకు చెందిన వారు ఉన్నారని డీఎస్పీ తెలిపారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ మహమ్మద్ రఫీ ఎస్‌ఐ నాగేశ్వరరావు రామాంజనేయులు ఏ ఎస్ ఐ రమణ ఐడి సిబ్బందిని, డీఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.
ఫోటోలు ఉన్నాయి


