బైక్‌ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

ట్రాక్టర్‌ ఢీకొని రైతుకు.. ప్రమాదంలో గాయపడిన మాజీ వలంటీర్‌ మృతి

మదనపల్లె టౌన్‌: రోడ్డు దాటుతున్న వృద్ధ మహిళను బైక్‌ ఢీకొని తీవ్ర గాయాలు పాలైన సంఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు ములకలచెరువుకు చెందిన పీరమ్మ (70) మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా అదుపు తప్పిన బైక్‌ ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కు టుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స కోసం మద నపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మదనపల్లె టౌన్‌: కురబలకోట మండలంలో శుక్రవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం, కోసువారిపల్లికి చెందిన రైతు భాస్కర్‌ రెడ్డి(56) వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేందుకు బైకులో మదనపల్లెకి బయలుదేరాడు. కురబలకోట ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్‌ రెడ్డికి కాలు విరిగింది. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలం వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.కురబలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రామసముద్రం: రోడ్డుప్రమాదంలో గాయపడిన మాజీ వలంటీర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం చెంబకూరు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రశేఖర్‌ కుమారుడు గురుప్రసాద్‌ (32) సొంత పని నిమిత్తం సోమవారం ద్విచక్ర వాహనంలో కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా శ్రీనివాసపురం వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. కల్లుకుంట గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం కోలారు మెడికల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గురుప్రసాద్‌ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేసి ప్రజల మన్ననలు పొందాడు. గురుప్రసాద్‌ మృతదేహానికి వైఎస్సార్‌సీపీ, కూటమి నాయకులు, గ్రామస్తులు, స్నేహితులు నివాళులు అర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement