ఆలయ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోగలరా? | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోగలరా?

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

చౌడేపల్లె : కోట్లాది రూపాయల విలువ చేసే మృత్యుంజయేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూములు ఆక్రమణలకు గురయ్యాయని, దమ్ముంటే వాటిని స్వాధీనం చేసుకొనే సత్తా మీకుందా అంటూ దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) విశ్వనాథ్‌ను అర్చకుడు ప్రశ్నించారు. బుధవారం స్థానిక మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో వివిధ సేవా టికెట్ల అనధికార వసూళ్లపై విచారణ చేపట్టారు. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఆలయంలో భక్తుల నుంచి వివిధ సేవాటికెట్లు వసూలు చేయాలని కమిషనర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఆ శాఖ అధికారులు టికెట్లు విక్రయించే క్రమంలో అర్చకులు, సిబ్బంది మధ్య ప్రతిరోజూ వాగ్వాదం జరుగుతోంది. దీంతో అధికారులు టికెట్లు వసూలు చేయరాదని అర్చకులు హైకోర్టు న్యాయస్థానంలో ఫిల్‌ దాఖలు చేశారు. భక్తులనుంచి అర్చకులు నాలుగు సొంత ఖాతాలకు నగదు అధిక మొత్తంలో జమ అయినట్లు విచారణలో గుర్తించినట్లు విశ్వనాథ్‌ తెలిపారు. టికెట్లను సిబ్బంది, అర్చకుల సమన్వంతో విక్రయించి వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాకు జమ చేసి వాటిని జీతం, ఆలయ నిర్వహణకు అధికారిక ఉత్తర్వుల రూపంలో చెల్లిస్తామని ఏసీ చెప్పడంతో అర్చకులు ససేమిరా అన్నారు. కోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు టికెట్లు విక్రయించరాదని అర్చకులు వాదించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడేంతవరకు యధావిధిగా దేవదాయశాఖ సిబ్బంటి సేవా టికెట్లు విక్రయిస్తారని వారికి అర్చకులు సహకరించాలని సూచించారు.అర్చకత్వం కోసం కేటాయించిన సుమారు 70 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని వాటిని తమకు స్వాదీనం చేయాలని ఏసీకి విన్నవించారు. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌, ఈఓ రమణ, సిబ్బంది వెంకటరమణ, అర్చకులు సుబ్రమణ్యం, కుమారస్వామి, మహేష్‌ ఉన్నారు. ఆలయానికి సుమారు 375 ఎకరాల మాన్యం, ఇనాం భూములున్నాయని, అవి ఆక్రమణదారుల చెరలో ఉన్నాయని దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌కు అర్చకులు వివరించారు. వాటిని స్వాధీనం చేసుకొవాలని కోరుతూ ఇదివరకే 14 కేసులు కోర్టులో వేశామని, విచారణ వివిధ దశలో ఉనట్లు విశ్వనాథ్‌ వెల్లడించారు. పూర్వీకులనుంచి స్వామివారికి కలిగిన ఆభరణాలు, ఆస్తులు, చరిత్ర పై ఆరా తీస్తూ విచారణ చేపట్టారు.

దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌తో అర్చకుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement