మదనపల్లె టౌన్ : దేశాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం. రాష్ట్రానికి గత రెండు సంవత్సరాల్లో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశాన్ని సంక్షేమం దిశగా తీసుకుపోతున్నాం. రాయలసీమకు హైదరాబాద్, బెంగళూరు, చైన్నెలతో కలిపే మూడు ప్రధాన ఎకనామిక్ కారిడార్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. బుధవారం మదనపల్లె లోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకెళ్తున్నారని చెప్పారు. హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ఆహార భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. త్వరలో రాయలసీమ విజన్ డాక్యుమెంట్ తీసుకురావడానికి ఆలోలిస్తున్నామని పేర్కొన్నారు. విదేశీ వస్తువులను కొనవద్దని ఆయన సూచించారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలుపునిచ్చారు. సమావేశంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, సాయిలోకేష్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానం, డాక్టర్ అజంతుల్లా ఖాన్, భగవాన్, చల్లపల్లినరసింహారెడ్డి, ఎనుగొండ మధునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్


