వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ 16 బాలుర మల్డీడే క్రికెట్ అంతర్ జిల్లాల పోటీలు రెండవ రోజు కొనసాగాయి. సోమవారం గ్రౌండ్ 1 లో కర్నూల్ , నెల్లూరు జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో కర్నూల్ జట్టు 72.3 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 218 పరుగులకే ఆలౌటయింది. అనంతరం రెండో ఇన్నింగ్ ప్రారంభించిన కర్నూల్ జట్టు 27 ఓవర్లు ఆడి, 1వికెట్ నష్టానికి 61 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడుతుంది. అలాగే గ్రౌండ్ 2లో కడప జిల్లా జట్టు 63.3 ఓవర్లలో 316 పరుగులు చేసి ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 288 పరుగులకే పరిమితమైంది.


