మృత్యువులోనూ వీడని భార్యభర్తల బంధం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని భార్యభర్తల బంధం

Jun 15 2026 1:11 AM | Updated on Jun 15 2026 1:11 AM

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

మదనపల్లె టౌన్‌: కష్టసుఖాల్లో ఒకరికొకరు కలకాలం తోడుగా ఉంటామని చేతిలో చేయ్యేసి ఒట్టు పెట్టిన ఆ దంపతులు మృత్యువులోనూ ఒక్కటయ్యారు.రోడ్డుప్రమాద రూపంలో మృత్యువు భార్యాభర్తలను బలితీసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుల కుటుంబీకులు, పుంగనూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణం రామారావు కాలనీకి చెందిన దంపతులు అమీర్‌ (45), సల్మా (40), వారి కుమారుడు ముస్తాకిర్‌ (19) సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో పుంగనూరు బయలుదేరారు. ఈడిగిపల్లి వద్దకు వెళ్లగానే బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అమీర్‌, సల్మా అక్కడికక్కడే మతి చెందారు. వారి కుమారుడు ముస్తాకిర్‌ తీవ్రంగా గాయపడి మత్యువుతో పోరాడు తున్నాడు. సంఘటన సమాచారం అందుకున్న పుంగనూరు పోలీసులు వెంటనే ఈడిగిపల్లికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన ముస్తాకిర్‌ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బొలెరో డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చావులోనూ భార్యాభర్తల మూడు ముళ్ల బంధం వీడలేదని పలువురు కన్నీటి పర్యంత మయ్యారు. పుంగనూరు రోడ్డు ప్రమాదంలో మదనపల్లె రామారావు కాలనీకి చెందిన భార్యాభర్తలు మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement