బి.కొత్తకోట : పాము కాటేసి తల్లీబిడ్డల పరిస్థితి విషమించిన ఘటన బి.కొత్తకోటలో జరిగింది. కలకలనం రేపుతున్న ఘటనపై బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని జనుపువారిపల్లికి చెందిన వెంకటరమణ భార్య పార్వతమ్మ, ఆమె కుమారుడు ప్రభాకర్ ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన నాగుపాము ఒకరి తరువాత మరొకరిని కాటేసింది. తల్లి,కుమారుడు తేరుకునే లోపే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు గమనించి తల్లీబిడ్డలను చికిత్సల కోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి, ప్రథమ చికిత్స అందించారు. అయినప్పటికీ వారి పరిస్థితి మెరుగు పడక పోవడంతో డాక్టర్ల సలహాపై తిరుపతికి తరలించారు.


