మదనపల్లె సిటీ: డీఈఓ సుబ్రమణ్యంకు మదనపల్లె డీవైఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తమీమ్‌అన్సారీయా ఉత్తర్వులు జారీ చేశారు. డీవైఈఓ లోకేశ్వరరెడ్డి మే 31వతేదీన పదవీ విరమణ చేశారు. అందువల్ల డీఈఓకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
సాక్షి, మదనపల్లె: రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలను పార్టీ పదవుల్లో నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కమిటీ గురువారం వెల్లడించింది. ఇందులో రాజంపేట నియోజకవర్గానికి చెందిన ముత్యాల మహేష్, బందలకుంట బాల బసిరెడ్డిలను సోషల్ మీడియా విభాగం జిల్లా కార్యదర్శులుగా, మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శిగా షేక్ రెడ్డి దర్బార్, ఎస్సీ సెల్ విభాగం జిల్లా కార్యదర్శిగా వర్ల మదన్ మోహన్, రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా గుడి సిద్దయ్య నాయుడులను నియమించారు. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల ఉపాధ్యక్షునిగా పాలెం బాబు సాహెబ్, మండల ప్రధాన కార్యదర్శిగా పండేటి చంద్రశేఖర్ రాజులు నియమితులయ్యారు.
అనధికార లేఔట్లపై చర్యలు
సాక్షి, మదనపల్లె: పీకేం ఉడా పరిధిలోని అనధికార లేఔట్లపై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ వైస్‌చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్‌శర్మ అధికారులను ఆదేశించారు. సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన అధికారుల సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. అభివృద్ధి పనులు, లేఔట్లు, భూ సమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికార లేఔట్లపై పంచాయతీ కార్యదర్శులు మొదటి నోటీసు జారీగా తిరిగి రెండో నోటిసులు ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. పాలనాపరంగా చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. సమావేశంలో ఉడా అధికారులు పాల్గొన్నారు.
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
మదనపల్లె సిటీ: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డీఈఓ సుబ్రమణ్యం అన్నారు. గురువారం స్థానిక లయన్స్ కంటి ఆస్పత్రిలో 2025–26 సంవత్సరంలో పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాఽధించిన 16 మంఇ విద్యార్థులకు ఏబీఎన్ ట్రస్టు ద్వారా ఒక్కొక్కరికి రూ.5000 వేలు చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ప్రణాళికబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ డాక్టర్ అనూరాధ, ట్రస్టు నిర్వాహకులు బోడిపాటి భాస్కర్‌నాయుడు, రిటైర్డు జెడి గుణశేఖర్‌పిళ్లై, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, లయన్స్‌క్లబ్ ప్రతినిదులు గంగారపు గౌతమ్, ఆడిటర్ ప్రసాద్, డాక్టర్ నివేదిక తదితరులు పాల్గొన్నారు.


