సాక్షి, మదనపల్లె: ప్రపంచానికి మనదేశం అందించిన గొప్ప జీవన విధానం యోగా అని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై బుధవారం యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ , జేసీ శివ్ నారాయణ్ శర్మ, సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి హజరయ్యారు. యోగా శిక్షకులు పాల్ బ్రహ్మకుమార్ హజరైన వారితో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు.ఈనెల 14న బోయకొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డీఆర్‌ఓ చంద్రశేఖర్ రెడ్డి, పర్యాటక రీజనల్ డైరెక్టరు రమణప్రసాద్, సమాచార శాఖ ఏడి పురుషోత్తం, ఏపీటీడీసి శ్రీనివాసరావు, డీఈఓ సుబ్రమణ్యం, డిపిఒ రాధమ్మ, డిఆర్డిఓ పీడీ నాగేశ్వరరావు, డిడిఓ లక్ష్మీపతి, తహసిల్దార్ అగ్రహం బావాజాన్, ఎంపీడీవో అబ్దుల్ షుకూర్, మండల అధికారులు, అంగన్వాడి, హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ ఫ్రీజోన్‌గా హార్సిలీహిల్స్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 పురస్కరించుకొని హార్సిలీహిల్స్‌పై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌న్‌ను కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ప్రజలు పాటించాల్సిన సూచనలు, చేయాల్సినవి, చేయకూడనివి తదితర అంశాలను ప్రదర్శనలో వివరించారు. ప్లాస్టిక్ వస్తువులతో కలిగే హానిపై పర్యావరణ అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆర్.ఓ.తాగునీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. హార్సిలీహిల్స్‌ను ప్లాస్టిక్ ఫ్రీజోన్‌గా చేసేందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


