ఘనంగా అక్షయ తదియ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అక్షయ తదియ

Apr 21 2026 4:38 AM | Updated on Apr 21 2026 4:38 AM

వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో ని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాల లో భాగంగా సోమవారం అక్షయ తదియ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెన్నా నదిలో స్నానాలు ఆచరించారు. అ నంతరం ఉత్సవాల్లో పాల్గొని స్వామి వార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు చెన్నకేశవ స్వామి ఎదుట తడి బట్టలతో సాష్టాంగ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం లభిస్తుందనే ప్రగా ఢ విశ్వాసంతో అనేక మంది భక్తులు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు.

వైభవంగా చెన్న కేఽశవుని పూలంగి సేవ

శ్రీ చెన్నకేశవ స్వామికి పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్‌ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీ కామాక్షీ వైద్యనాధేశ్వర ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారికి పూజలు నిర్వహించారు.

ఇష్ట వాహనాలపై హరిహరులు

రాత్రి శ్రీ చెన్నకేశవ స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై భక్తుల కు దర్శనమిచ్చారు. గ్రామంలోని శ్రీ కామా క్షీ వైద్యనాఽథేశ్వర స్వాములు నంది వాహనంపై భక్తులను కరుణించారు.

నేడు కల్యాణోత్సవాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాఽథ స్వాములకు కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి శ్రీలక్ష్మీ చెన్న కేశవ స్వామికి శ్రీదేవి, భూదేవిలతో కళ్యాణోత్స వం జరుగుతుంది. రాత్రి గజవాహన సేవ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement