ఏం తినాలి | - | Sakshi
Sakshi News home page

ఏం తినాలి

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

ఏం తినాలి ఎప్పుడిస్తారో టమాటా పనికి డబ్బులెక్కువ విధి లేక వెళ్తున్నాం

ఈనెల ఒకటి నుంచి ఉపాధి పనులు చేశాను. కూలి పనులనే ఆధారంగా జీవిస్తున్నాం. చేసిన పనులకు ఇంతవరకు బిల్లు రాలేదు. ఇలా అయితే పూట గడవడం కూడా కష్టంగా ఉంటోంది. ప్రతివారం అందాల్సిన కూలి సొమ్ము అందలేదు. వేతనాలు ఇవ్వకుండా పనులు చేసేది ఎలా.

– శ్రీనివాసులు, ఉపాధికూలీ, ఉప్పరవాండ్లపల్లి

ఉపాధి కూలీ పనులు చేసినా వే తనాలు అందలేదు. ఎప్పడిస్తా రో తెలియడం లేదు. ఖాతాల కు జమ చేయాల్సిన సొమ్ము అందక ఇబ్బందులు పడుతున్నాం. కూలి డబ్బుతోనే జీవనం సాగించాలి. ఉపాధి కూలీని నమ్ముకుని పను లు చేస్తే ఇలా చెల్లింపులో జాప్యం చేస్తే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. – చిన్న ఉత్తన్న, తంబళ్లపల్లె

ఉపాధి హామీ పథకం పనులు చేయడం కష్టంగా మారింది. రోజుకు వచ్చే కూలి రూ.307. బిల్లులు కూడా సకాలంలో రావడం లేదు. దానివల్ల టమాట పంటలో కూలి పనులకు వెళ్తున్నాం. పనులకు రోజుకు రూ.540 కూలివస్తుంది. సొమ్ము ఆరోజే చెల్లిస్తారు. దానివల్ల మేం ఉపాధి హామీ పనులకు వెళ్లడం తగ్గించి, పొలాల్లో పనులకే వెళ్తున్నాం.

– సరోజమ్మ, ఎరజ్రేనువారిపల్లి, కురబలకోట

ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి పనులకు వెళ్తున్నా. కొత్తగా నిబంధనల భారం ఎక్కువైంది. చేస్తున్న పనులకు గిట్టుబాటు కావడం లేదు. కుటుంబాలు గడవడం కోసం చేస్తున్న పనికి సకాలంలో బిల్లులు పడటం లేదు. అయినప్పటికి తప్పనిసరి పరిస్థితిలో పనులకు వెళ్తున్నాం.

– కోళ్ల వెంకటశివారెడ్డి, బండపల్లి, కురబలకోట

Advertisement
 
Advertisement
Advertisement