పాముకాటుతో మహిళకు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళకు అస్వస్థత

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

మదనపల్లె టౌన్‌ : కూలి పనులకు వెళ్లిన మహిళను విషసర్పం కాటేసిన సంఘటన సోమవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. విష్ణుపల్లికి చెందిన మల్లికార్జున భార్య దేవమ్మ(45) బోరెడ్డికోటలో పోలంలో టమాటాలు కోయడానికి కూలికి వెళ్లింది. టమాటాలు కోస్తుండగా కాలిపై పాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని స్థానికులు తంబళ్లపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటోంది.

మద్యం తాగొద్దన్నందుకు హోంగార్డుపై దాడి

ప్రొద్దుటూరు క్రైం : అర్ధరాత్రి సమయంలో వీధుల్లో మద్యం తాగొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి హోంగార్డుపై దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గాంధీరోడ్డులోని మౌలానాఆజాద్‌వీధి–4లో ఆదివారం అర్దరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో హోంగార్డు అక్కడికి వెళ్లడంతో కొందరు వ్యక్తులు పారిపోగా సుందరాచార్యుల వీధికి చెందిన తాహిర్‌బాషా అనే యువకుడు అక్కడే ఉండి హోంగార్డు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించరాదని, పైగా అర్దరాత్రి సమయంలో తాగడం తప్పని చెబుతుండగా నాకు చెప్పడానికి నువ్వు ఎవరంటూ తాహిర్‌బాషా తన చేతిలో ఉన్న బీరు సీసాతో హోంగార్డును కొట్టడంతో తలకు వాపు, మెడపై గాయమైంది. హోంగార్డు రఫి ఫిర్యాదు మేరకు తాహిర్‌బాషాపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

యువతి అదృశ్యంపై కేసునమోదు

ముద్దనూరు : మండలంలోని వేల్పుచెర్ల గ్రామానికి చెందిన రజిత అనే 19సంవత్సరాల యువతి అదృశ్యమైనట్లు పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సమాచారం మేరకు వేల్పుచెర్ల గ్రామానికి చెందిన రజిత ప్రైవేట్‌ నర్సుగా పనిచేస్తోంది.ఆదివారం రాత్రి ఇంటిలో భోజనంచేసి పడుకుంది.సోమవారం తెల్లవారుజామున ఆమె ఇంటిలో కనిపించలేదు.చుట్టుపక్కలవారిని విచారించారు.ఆమె ఆచూకి లభించకపోవడంతో రజిత తండ్రి ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు.ఈ మేరకు అదృశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

రాజంపేట : చిట్వేలి పోలీసుసేష్టన్‌లో విధులు నిర్వర్తించేందుకు కానిస్టేబుల్‌ కే.సుధాకర్‌రాజు (56) రాజంపేట నుంచి బయలుదేరిన క్రమంలో సోమవారం పోలిచెరువు వద్ద డివైడర్‌ను ఢీ కొని మృతి చెందారు. దీంతో రాజంపేట సబ్‌బ్‌డివిజన్‌ పోలీసువర్గాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. సుధాకర్‌రాజు గతంలో రాజంపేట, మన్నూరు పోలీసుస్టేషన్‌లో పనిచేశారు. విధి నిర్వహణలో సుధాకర్‌రాజు క్రమశిక్షణతో పనిచేసేవారని తోటి కానిస్టేబుళ్లు గుర్తుచేసుకున్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టరం నిర్వహించి, సంబంధీకులకు అప్పగించారు. సుధాకర్‌రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రాజంపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ నుంచి ఏ ఆర్‌, అక్కడి నుంచి సివిల్‌ కానిస్టేబుల్‌గా ప్రస్తుతం చిట్వేలిలో పనిచేస్తున్నారు.

పిచ్చికుక్కదాడిలో చిన్నారికి గాయాలు

ముద్దనూరు : మండలంలోని యామవరం గ్రామంలో పిచ్చికుక్క గత రెండు రోజులనుంచి దాడులు చేస్తోంది.సోమవారం 4 ఏళ్ల చిన్నారిని కరిచింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరిని కరిచినట్లు స్థానికులు తెలిపారు. ,గ్రామంలో 4 గేదెలు పిచ్చికుక్క దాడిలో గాయపడ్డాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement