● శిథిలావస్థలో బ్రిటిష్‌ బంగ్లా | - | Sakshi
Sakshi News home page

● శిథిలావస్థలో బ్రిటిష్‌ బంగ్లా

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

మదనపల్లె నీటిపారుదలశాఖకు గొప్ప చరిత్ర ఉంది. బ్రిటీషుపాలకులు మదనపల్లె కేంద్రంగా ఈఈ కార్యాలయం ప్రారంభించారు. దీని పరిధిలో ఉమ్మడిచిత్తూరు, కడప, అనంతపురం, కర్ణాటకలోని బళ్లారి జిల్లాలు ఉండేవి. ఇక్కడ పనిచేసే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల కోసం నివాస బంగ్లాను (ప్రస్తుత హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ఎదుట) నిర్మించారు. బ్రిటీషుపాలకుల రాజసం ఉట్టిపడేలా బంగ్లాను నిర్మించగా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో ఎకరాల విస్తీర్ణం ఈ బంగ్లా పరిధిలో ఉండేది. మధ్యలో ఈ భవనం ఉండేది. 2000 తర్వాత ఈ బంగ్లాలో ఈఈలు నివాసం లేకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దీనికి సంబంధించిన భూమిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వశాఖలకు కేటాయించడంతో నీటిపారుదలశాఖ భూమి హరించుకుపోయింది.

–మదనపల్లె

Advertisement
 
Advertisement
Advertisement