కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కడపతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఎర్రమట్టిపై హాకీ ప్రాక్టిస్ చేసి ఇంటర్నేషన్‌లో ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్‌పై ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కడప డీఎస్‌ఏ క్రీడా మైదానంలో దాదాపు రూ.8. కోట్లతో ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ నిర్మించింది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్‌బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవ చూపారు. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్షతతో ప్రారంభించకపోవడం బాధాకరం.
–దేవిరెడ్డి ఆదిత్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం


