మూడేళ్లయినా ప్రారంభం కాలేదు | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లయినా ప్రారంభం కాలేదు

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

ఆస్ట్రానాట్‌ టర్ఫ్‌ పిచ్‌ పూర్తయి దాదాపు మూడేళ్లయినా ఇంతవరకు ప్రారంభం కాాలేదు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా క్రీడాకారుల భవిష్యత్‌ కోసం ఈ పిచ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హాకీని మట్టిపై ఆడటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రౌండ్‌లో ఆడుతుంటే వాకర్స్‌కు మాకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. జిల్లా నుంచి ఇంటర్నేషనల్‌ హాకీ టీం ఆడాలంటే ఈ పిచ్‌లు ఎంతో అవసరం. ఆస్ట్రానాట్‌ టర్ఫ్‌ పిచ్‌ను ప్రారంభించాలని పలుమార్లు కలెక్టర్‌, కమిషనర్‌, డీఎస్‌డీవోకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. –జితేష్‌, క్రీడాకారుడు.కడప

Advertisement
 
Advertisement
Advertisement