వైభవంగా చెన్నకేశవుని చందనోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా చెన్నకేశవుని చందనోత్సవం

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో శ్రీ చెన్న కేశవ స్వామి మూల విరాట్‌కు చందనోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్‌ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చందనంతో ప్రత్యేకంగా అలంకరించారు. చందన భూషితుడై నయనానందకరంగా వున్న స్వామి వారి దివ్య రూపాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

● పుష్పగిరి గ్రామంలోని శ్రీ కామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ కామాక్షీ వైద్యనాధ స్వామి రాత్రి మయూర వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హనుమంత వాహనంపై కొలువు దీరి భక్తులకు దర్శనమిచ్చారు.

పుష్పగిరిలో నేడు

అక్ష తదియ ఉత్సవాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అతి ముఖ్యమైన అక్షయ తదియ తిరుణాల ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఉదయం చెన్న కేశవునికి పూలంగి సేవ జరుగుతుంది. రాత్రి జరిగే వైద్యనాథుడి నందివాహన సేవకు, శ్రీ చెన్న కేశవుని గరుడ వాహన సేవకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.

చందనోత్సవ అలంకారభూషితుడైన

చెన్నకేశవ స్వామి

Advertisement
 
Advertisement
Advertisement