అంకిశెట్టిపల్లెలో ఇరువర్గాల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

అంకిశెట్టిపల్లెలో ఇరువర్గాల ఘర్షణ

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లెకు చెందిన సుమన్‌ అదే ఊరికి చెందిన అభిలాష్‌ ను ఆదివారం బైక్‌తో పొరపాటున ఢీకొన్నాడు. స్థానికంగా ఉన్న యువకులు గమనించి సుమన్‌ను చితక బాదారు. వెంటనే అతను ఇంటికి వచ్చి కత్తి తీసుకుని వెళ్లి, తనపై దాడిచేసిన బాబు, సుధాకర్‌, సోమశేఖర్‌లను పొడిచాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కత్తితో దాడి చేసిన సుమన్‌ ను పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు, అంకి శెట్టిపల్లికి చేరుకుని సుమన్‌ను విడిపించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే సుమన్‌ చేతిలో కత్తిపోట్లకు గురైన బాధితులు కూడా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement