సదుం : అన్నమయ్య జిల్లా సదుం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1976–77 సంవత్సరం పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పలు ప్రాంతాల్లో స్థిరపడినవారు పాఠశాలకు చేరుకున్నారు. ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. ఆటపాటలతో సందడి చేశారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. పలువురు పూర్వ విద్యార్థుల సహకారంతో రూ. 6 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సభాప్రాంగణానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సుబ్రమణ్యం, రిటైర్డ్ హెచ్‌ఎం జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


