రాయచోటి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాయచోటి పట్టణంలోని సలీంగోల్డ్ కవరింగ్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షాపు దగ్ధమైంది. ఆదివారం ఉదయం షాపు ప్రారంభంలో భాగంగా విద్యుత్ లైట్లు వేయగానే షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయని, ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. ఏసీ వైర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పీఓపీకి అంటుకుందన్నారు. దీంతో ప్రమాదం సంభవించిందన్నారు.ఈ విషయ్నాని రాయచోటి అగ్నిమాపక కార్యాలయానికి తెలియజేయగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఆలస్యం అవుతుండటంతో లక్కిరెడ్డిపల్లి అగ్నిమాపక వాహనాన్ని రప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. షాపులో ఉన్న గిల్ట్ గోల్డ్, ఆర్నమెంట్స్ కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి. అలాగే ఏసీ, టేబుల్స్ మంటల్లో కాలిపోయాయి.


