కిడ్నీ రాకెట్‌ కేసులో మరో నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్‌ కేసులో మరో నిందితుడు అరెస్ట్‌

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

మదనపల్లె టౌన్‌ : సంచలనం రేకెత్తించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్‌ కేసులో ఆదివారం ఏ–20 నిందితుడిని స్థానిక 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ పావని తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్సత్రిలో విజయవాడకు చెందిన సాడి జమున(29) కిడ్నీ తొలగించే క్రమంలో వైద్యం వికటించి ఆమె మత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్‌ టెక్నీషియన్‌ బాలు అలియాస్‌ బాలరంగడు, కాకర్లసత్య, పిల్లి పద్మ, సూరి బాబుతో పాటు కిడ్నీ తొలగించిన డాక్టర్లు ఆంజనేయులు, పార్థసారథిరెడ్డితో కలిపి మొత్తం 26 మందిపై కేసు నమోదు చేయగా అందులో 11మందిని అరెస్టు చేశారు. ఆదివారం 20వ నిందితుడిగా ఉన్న కడపకు చెందిన గ్లోబల్‌ ఆస్పత్రి ఓటీ అసిస్టెంట్‌ నవీన్‌ (28)ను అరెస్ట్‌ చేసి వైద్య పరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement