బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పైకి వచ్చే
యువకులు ఇక్కడ నిర్మాణాలపై పేర్లు రాస్తూ కళ తప్పేలా చేస్తున్నారు.
వ్యూ పాయింట్లపై ఇప్పటికే బొగ్గు, ఆకులతో పేర్లు గుర్తులతో ఖరాబు చేశారు. ఇక్కడే గవర్నర్ బంగ్లా
గోడలపై కూడా ఇలాగే రాస్తారని
హెచ్చరిక బోర్డు పెట్టారు. రాస్తే
రూ.5 వేలు జరిమానా అని కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ గవర్నర్ బంగ్లా గోడలను కూడా వదలకుండా ఇలా పిచ్చి రాతలతో నింపేశారు.
దాంతో కోడలు అందం కోల్పోతున్నాయి. దీనిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా యువకుల్లో
మార్పు రావడం లేదు.
–బి.కొత్తకోట


