వైభవం.. బ్రహ్మోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. బ్రహ్మోత్సవం

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

మదనపల్లెలో ఐటీడీఏ కేంద్రం ఏర్పాటు

వల్లూరు: పుష్పగిరి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి సింహ వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వైద్యనాధ్యస్వామికి అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్చన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలమధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో నిర్వహించారు.

● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్‌ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలను, తోమాల సేవను నిర్వ హించారు.సాయంత్రం వివిధ హోమాలు జరిపారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్నకేశవ స్వామి వారిని కొండపై నుంచి పెన్నా నది మీదుగా గ్రామంలోకి తీసుకొచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.

సింహ వాహనంపై వైద్యనాఽథేశ్వరుడు

హంస వాహంపై చెన్న కేశవుడు

మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఐటీడీఏ ఏర్పాటు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్టీ కమిషన్‌ సభ్యులు పి.వెంకటప్ప అన్నారు. శుక్రవారం స్థానిక సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌, కలెక్టరేట్‌లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనుల అటవీ హక్కుల భూములకు సంబంధించిన ఆర్‌ఓఆర్‌ పట్టాల సమస్యలను ఫారెస్ట్‌ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని, గిరిజన కాలనీల్లో తాగునీరు, విద్య, వైద్యం, పింఛన్లు, విద్యుత్‌, గృహ వసతి సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనుల కోసం ప్రతి కాలనీలో ప్రత్యేక ఆధార్‌ నమోదు శిబిరాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, పరిహారం చెల్లింపుల ప్రక్రియలను పూర్తి చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖలకు సూచించారు. 41 అట్రాసిటీ కేసుల్లో 39 కేసులకు రూ.24.66 లక్షల పరిహారం చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమలో ఐటీడీఏ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, రాజంపేట, రాయచోటి, మదనపల్లె ప్రాంతాల్లో ఎరుకుల, యానాది, సుగాలి, లంబాడి గిరిజనులు అధికంగా నివసిస్తున్నారని తెలిపారు. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమాల్లో సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డిఆర్‌ఓ చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె. తేజస్విని, గిరిజన సంఘాల నాయకులు కోనేటి దివాకర్‌, కావడి రవీంద్ర, శ్రీనివాస వర్మ, సాకే ముసలయ్య, కిరణ్‌ బాబు, బొజ్జప్ప, సులోచన, మున్నా నాయక్‌, విశ్వనాథ నాయక్‌, శ్రీనివాస శర్మ, జీవీ రమణ, కోనయ్య, లక్ష్మణ నాయక్‌, గంగరాజు నాయక్‌, నాగు నాయక్‌, వెంకటరమణ, వసంతమ్మ పాల్గొన్నారు.

మండలాల్లో ఓటర్ల వివరాలు

మండలం పురుషులు మహిళలు ఇతరులు

చిన్నమండ్యం 13,213 13,789 5

గాలివీడు 20,072 20,580 1

లక్కిరెడ్డిపల్లె 13,320 13,589 –

రామాపురం 13,105 13,767 1

రాయచోటి 13,519 13,650 2

సంబేపల్లి 14,455 14,959 –

గుర్రంకొండ 17,415 17,668 2

కలకడ 13,896 14,137 –

కలికిరి 19,833 21,054 7

కేవిపల్లె 15,993 15,956 1

పీలేరు 30,588 32,559 10

సదుం 13,777 14,235 1

సోమల 17,072 17,627 –

వాల్మీకిపురం 17,775 19,015 1

బి.కొత్తకోట 13,537 14,045 –

చౌడేపల్లె 17,537 18,068 –

కురబలకోట 17,292 18,095 1

మదనపల్లె 41,551 43,633 39

ములకలచెరువు 18,578 19.477 –

నిమ్మనపల్లె 12,836 13,362 2

పెద్దమండ్యం 13,879 14,013 5

పెద్దతిప్పసముద్రం 20,591 20,991 1

పుంగనూరు 21,233 22,002 –

రామసముద్రం 19,692 20,022 –

తంబళ్లపల్లె 16,011 16,537 2

చేర్పులు మార్పులు: ప్రస్తుతం ప్రచురించిన ఓటరు జాబితాలో పొరపాట్లకు, చేర్పులు మార్పులకు అవకాశం ఇచ్చారు. జాబితా పరిశీలించి తప్పులుంటే వాటిని సరిచేసుకునేందుకు, అలాగే ఓటు లేకపోతే నమోదు చేసుకునేందుకు నియోజకవర్గ ఎన్నికల అధికారికి వినతి సమర్పించాల్సి ఉంటుంది. పరిశీలించాక వాటిపై చర్యలు తీసుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement