మదనపల్లె: అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీల్లో నూతన ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రచురించింది. శుక్రవారం జిల్లాలోని గ్రామపంచాయతీ కేంద్రాలు, సచివాలయంలో ఓటర్‌ర్ జాబితాలను పెట్టారు. గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని వార్డుల్లో ఓటర్ల సంఖ్యను సూచించే ప్రక్రియకు సంబంధించి అన్ని చర్యలు పూర్తి చేశారు. జాబితా ప్రచరణకు ముందు ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో చర్యలు ముగియడంతో జాబితా బహిరంగపరిచారు. ఈ ఓటర్ జాబితా మేరకు జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. మూడు డివిజన్ల పరిధిలోనూ మహిళా ఓటర్లదే పై చేయిగా ఉంది. ఇతరులైన ట్రాన్స్‌జెండర్లలో మదనపల్లెలో అధికంగా ఉన్నారు.
ఓటరు మహారాణి
జిల్లాలో 411 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 4230 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని ఓటర్ల సంఖ్య 9,09,602 మంది అయితే, వీరిలో అత్యధిక ఓట్లు మహిళలవే ఉన్నాయి. పురుష ఓటర్లు 4,46,691 మంది, మహిళా ఓటర్లు 4,62,830 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 16,139 మంది అధికం. ఈ సంఖ్య ఒక ప్రాంతంలోనే లేదు. అన్నిచోట్లా కనిపిస్తోంది.
కేవీ పల్లెలోనే పురుషుల ఆధిక్యం
జిల్లాలో 25 మండలాలు ఉండగా కొత్త ఓటర్ల జాబితా మేరకు పురుష ఓటర్ల ఆధిపత్యం కేవలం ఒక్క మండలానికి మాత్రమే పరిమిత మైంది. పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లె మండలం మినహాయిస్తే మిగిలిన 24 మండలాల్లో మహిళా ఓటర్ల అధికంగా ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ మహిళలే కీలకంగా మారారు.
ట్రాన్స్‌జెండర్లలో మదనపల్లె
జిల్లాలో ట్రాన్‌న్స్‌జెండర్ల ఓటర్ల సంఖ్య 81గా గుర్తించారు. అందులో మదనపల్లెలో అత్యధికంగా 39 మంది ఉన్నారు. మిగతా మండలాల్లో ఒకటి నుంచి పది మంది దాకా ఉన్నారు. లక్కిరెడ్డిపల్లి, సంబేపల్లె, కలకడ, సోమల, బి.కొత్తకోట, చౌడేపల్లి, ములకలచెరువు, పుంగనూరు, రామసముద్రం మండలాల్లో ఒక్కరు కూడా లేరు.
● జిల్లా గ్రామపంచాయతీలో మహిళా ఓటర్లదే పైచేయి కావడంతో భవిష్యత్తు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యత దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచు, ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మహిళలకు అవకాశం ఇవ్వడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా ముద్రపడ్డారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అతివలకు 50 శాతం దాకా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చారు. అభివృద్ధి పనుల్లోనూ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించారు. గత ఐదేళ్లలో స్థానిక పాలనలో మహిళలకు గౌరవం దక్కింది.
డివిజన్ల వారీగా ఓటర్లు
డివిజన్ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
స్థానికంలో మహిళదే పైచేయి
జిల్లాలో గ్రామ పంచాయతీలఓటర్ల జాబితా ప్రచురణ
మొత్తం ఓటర్లు 9,09,692 మంది
మహిళలు 4,62,830 మంది
ఒక్క మండలంలోనేపురుషుల ఆధిక్యం
మదనపల్లె 2,12,658 2,20,245 50 4,32,953
పీలేరు 1,46,349 1,52,251 22 2,98,622
రాయచోటి 87,684 90,334 9 1,78,027


