డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వచ్చి.. మృత్యుఒడికి | - | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వచ్చి.. మృత్యుఒడికి

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

బైక్‌ను ఢీకొన్న కారు

కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌ వద్ద ప్రమాదం

ప్రమాదానికి కారణమైన కారు నుజ్జునుజ్జు అయిన బైక్‌

మదనపల్లె టౌన్‌ : డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం బైకులో మదనపల్లెకు వచ్చి వెళుతుండగా కారు మృత్యువు రూపంలో ఓ యుకుడి ప్రాణాలను కబళించింది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రడు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లె పంచాయతీ బూదలవారిపల్లెకు చెందిన రాజు కుమారుడు సీలింగు చిన్నప్ప(34) డ్రైవింగ్‌తోపాటు చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ భార్య శిరీషా, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తరచూ వాహనాలు తనిఖీ చేస్తూ.. డ్రైవింగ్‌ లైసెన్సు లేదని ఫైన్లు వేస్తుండటంతో భయపడి ఇటీవల డ్రైవింగ్‌ లైసెన్సుకుఽ దరఖాస్తు చేసుకున్నాడు. ఎంవీఐ వద్దకు డ్రైవింగ్‌ టెస్టుకు హాజరయ్యేందుకు మదనపల్లెకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చాడు. మదనపల్లెలో పని పూర్తి కాగానే తిరిగి ఇంటికి తన బైక్‌పై వెళుతుండగా, మార్గంమధ్యలోని కురబలకోట మండలం రైల్వే ప్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద కారు మృత్యువు రూపంలో వచ్చి.. చిన్నప్ప బైకును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి రలించారు. చిన్నప్ప మరణ వార్త తెలియగానే ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement