పెద్దమండ్యం : మహిళల ఆర్థికాభివృద్ధికి సమాఖ్య సభ్యులు, సంఘమిత్రలు, ఈ నారీలు కృషి చేయాలని జిల్లా డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు అన్నారు. స్థానిక వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం సంఘమిత్రలు, ఈ నారీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక ఆర్థిక రుణ ప్రణాళిక సమగ్రంగా తయారు చేయాలని సూచించారు. సభ్యులకు అవసరమయ్యే సమయంలోనే రుణ సదుపాయం అందించాలన్నారు. సభ్యుల కోరిక మేరకు సూక్ష్మ ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ధర్మరాజు, ఏపీఎం నరసింహులు, మండల సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, సీసీలు, సంఘమిత్రలు పాల్గొన్నారు.
కురబల అభివృద్ధికి
నిరంతర కృషి
మదనపల్లె : కురబల అభ్యున్నతి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని కురబల సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లెరెడ్డి ప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మన్న పేర్కొన్నారు. శుక్రవారం అనిబిసెంట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కురబలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారని, ఇది శుభపరిణామమని అన్నారు. కురబల శ్రేయస్సు కోసం నూతనంగా ఎన్నికై న రాష్ట్ర కమిటీ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. మదనపల్లె నియోజకవర్గంలోని కురబలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎదగాలని ఆశించే వారికి అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న కురబ విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కాంతారావు, రఘునాథ్, డివిజన్ అధ్యక్షులు కప్పల శ్రీరాములు, జనరల్ సెక్రటరీ సదాశివ, సలహాదారు రెడ్డప్ప, అడ్వకేట్ మనోహర్ పాల్గొన్నారు.


