వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల ఆలయాల్లో గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైధ్యనాఽథేశ్వర స్వామి ఆలయంలో ఉదయం గణపతి పూజ నిర్వహించారు. వైద్యనాధునికి రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవికి కుంకుమార్చన చేశారు. రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు. అనంతరం దివిటీల వెలుగులు, మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.
● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ జరిగింది. అనంతరం ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజను నిర్వహించారు. అనంతరం రాత్రి ధ్వజారోహణ చేశారు. అనంతరం కొండపై నుంచి స్వామి వారిని తిరుచ్చి వాహనంలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.


