చెరువుల అభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

చెరువుల అభివృద్ధికి చర్యలు

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

చౌడేపల్లె: జలధార కార్యక్రమం ద్వారా చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడతామని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు.బుధవారం చౌడేపల్లె మండలంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. జలధార కార్యక్రమంతో భూగర్భజలాలు పెంపొందుతాయన్నారు. దిగువపల్లె పంచాయతీలోని శెట్టికుంట, కాగతి పంచాయతీ పరిధిలోని కాగతి చెరువులను కలెక్టర్‌ పరిశీలించారు. చెరువుల పరిస్థితి, ఆయకట్టు గురించి ఆరా తీశారు. జలధార కార్యక్రమంలో భాగంగా చెరువులకు అనుసంధానంగా ఉన్న ఫీడరు కాలువలు, సఫ్లై ఛానల్‌ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా అవసరమైన ప్రదేశాల్లో సఫ్లై ఛానల్‌ పనులు చేపట్టాలన్నారు. మండలంలో పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, దర్జాగా ఆక్రమించుకొని పంటలు సాగుచేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వెంటనే విచారించి చర్యలు చేపట్టాలని కోరారు. కొలింపల్లె వద్ద గోర్లకుంట, కాగతి చెర్వులకు వచ్చే వర్షపునీటి కాలువలు ఆక్రమణలకు గురైయ్యాయని వర్షాకాలంలో వరదనీరు ఇళ్లలోకి చేరుతుందని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉపాధిపథకం ద్వారా మాదం వారిపల్లె సమీపంలో చేపట్టిన సఫ్లై ఛానల్‌ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమలో ఎంపీడీఓ లీలామాధవి, తహసీల్దార్‌ పార్వతి, డీటీ దొరస్వామి,డిప్యూటీ ఎంపీడీఓ గఫూర్‌, ఏఈలు చందన, నాగరాజ, ఏఓ మోహన్‌,జెఈ కోదండపాణి,మండల సర్వేయర్‌ సుఽరేంధ్ర నాయక్‌ , పంచాయతీ కార్యదర్శి పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement