ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి

మదనపల్లె టౌన్‌: ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచాలని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మదనపల్లె పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రితో కలిసి ఎస్పీ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు ప్రణాళికలు, కేసుల పురోగతిపై ఆయా పోలీస్‌ స్టేషన్ల సీఐ, ఎస్‌ఐలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎర్రచందనం కేసుల్లో నిందితులను అరెస్టు చేయడమే కాకుండా వారికి శిక్షలు పడేలా సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు. అలాగే చార్జ్‌ షీట్లు గడువులోగా దాఖలు చేయాలన్నారు. ఎర్రచందనం కేసుల్లో ఉన్న వారి కదిలికలపైనిఘా ఉంచాలనిసూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకోవలన్నారు. స్మగ్లింగ్‌ చేసే ప్రధాన మార్గాలను, చెక్‌ పోస్లును ఆకస్మికంగా తనిఖీలు చేయాలని చెప్పారు. నేరస్తులను పట్టుకోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

Advertisement
 
Advertisement
Advertisement