ములకలచెరువు: కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టుచేసి మద్యం స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి కథనం మేరకు... తన సిబ్బందితో బురకాయలకోట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పీటీయంకు చెందిన నాగరాజురెడ్డి తన కారులో మద్దినాయనిపల్లెకు మద్యం తరలిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. కారు, మద్యం స్వాధీనం చేసుకొని ములకలచెరువు పోలీసు స్టేషన్‌లో అరెస్టు చూపించారు. 558 మద్యం బాటళ్లు, 60 బీర్లు సీజ్ చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
అప్పు ఇవ్వలేదని
యువకుడిపై దాడి
గాలివీడు: మండలంలోని నూలివీడు గ్రామంలో అప్పు ఇవ్వలేదనే కారణంతో ఒక యువకుడిపై దాడి జరిగిన ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అశోక్‌పై అదే గ్రామానికి చెందిన మ రో ఇద్దరు దాడి చేసినట్లు సమాచారం.వివరాల ప్రకారం, నిందితులు అశోక్‌ను రూ.10 వేలు అప్పు ఇవ్వాలని కోరగా, అతను నిరాకరించడంతో కోపోద్రిక్తులై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయాన్ని హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
ఎగువగొట్టివీడు వద్ద
బైక్ ప్రమాదం
గాలివీడు: మండలంలోని ఎగువగొట్టివీడు వద్ద బుధవారం ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. స్థానికుల కథనం మేరకు తూముకుంట గ్రామానికి చెందిన అమర్నాథ రెడ్డి, వరప్రసాద్ రెడ్డిలు బైక్‌పై ప్రయాణిస్తుండగా, గొట్టివీడు వద్దకు రాగానే వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న కాలువ గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అవగా, ఒకరి పరిస్థితి విషమంగా వుంది. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.


