సివిల్‌ కేసును క్రిమినల్‌ కేసుగా మార్చి వేధింపులు | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ కేసును క్రిమినల్‌ కేసుగా మార్చి వేధింపులు

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

రొంపిచెర్ల : సివిల్‌ కేసును రొంపిచెర్ల పోలీసులు క్రిమినల్‌ కేసుగా మార్చి వేధిస్తున్నారని రొంపిచెర్ల గ్రామానికి చెందిన రైతు మొగల్‌ సూల్తాన్‌ బేగ్‌, గహీదుల్లా బేగ్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు మంగళవారం తెలిపారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మయ్యగారిపల్లె గ్రామపంచాయతీలోని సర్వే నంబరు 564లో బండిబాట (10 అడుగులు)పై తమకు సర్వ హక్కులు ఉన్నాయని అన్నారు. అయితే యాకుబ్‌సాబ్‌ కుమారుడు మహ్మద్‌రఫీ తమకు బండి బాట లేదని 2021లో అభ్యంతరం చెప్పారని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్‌కు తమ రికార్డులు చూపించగా, ప్లాన్‌లో 10 అడుగులు బండి బాట ఉందని తేల్చి చెప్పారని తెలిపారు. అయితే మహ్మద్‌రఫీ రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తమపై సివిల్‌ కేసును క్రిమినల్‌ కేసుగా మార్చి వేసి అప్పుటి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తప్పుడు కేసు బనాయించాడని తెలిపారు. ఇదేమని అడిగితే మమ్మద్‌రఫీ చెప్పినట్లు వింటేనే కేసును మూసి వేస్తామని ఎస్‌ఐ బెదిరించారని తెలిపారు. మీ భూమిని వదిలి వేయాలని, లేకపోతే మహ్మద్‌ రఫికి రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించారని విలపించారు. నాలుగు సంవత్సరాలుగా పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పుటికై నా న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. దీంతో ఎస్పీ బాధితుడికి న్యాయం చేయాలని కల్లూరు సీఐ జయరాం నాయక్‌, రొంపిచెర్ల ఎస్‌ఐ మధుసూధన్‌ను ఆదేశించారు. వారం రోజులలో న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు.

రొంపిచెర్ల పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు

Advertisement
 
Advertisement
Advertisement