ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు తవ్వకాలు పుణ్యమా అని వెలగడం లేదు. జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ఎల్‌ఈడీ విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. వీటకి విద్యుత్‌లైన్ల ఏర్పాటు అంతా భూగర్భంలోనే ఉంది. నెల రోజుల వ్యవధిలో ప్రయివేట్ టెలికామ్ సంస్థలు జరిపిన తవ్వకాల్లో విద్యుత్ కేబుళ్లు దెబ్బతిని పలుచోట్ల తెగిపోయాయి. దీంతో నెలల తరబడి విద్యుద్దీపాలు వెలగడంలేదు. జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రాత్రిళ్లు దీపాలు వెలగక పోవడంతో రహదారి మొత్తం అంధకారంగా మారుతోంది. దీంతో చీకట్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.


