బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేడ్కర్‌

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

మదనపల్లె: భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. అంబేడ్కర్‌ 135వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఓ కళ్యాణ మండపంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచనలు, సిద్ధాంతాలు సమాజంలో ప్రతి వర్గానికి మార్గదర్శకమని అన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, విలువల ఆచరణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లా డారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ డీఆర్వో చంద్రశేఖర్‌ రెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి దామోదర్‌ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎం.పర్వీన్‌ తాజ్‌, భావన, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జి.శివరాం, రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్‌ వై.సుదర్శనం, డివిఎంసి మెంబర్లు పి.శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, ఎస్‌. రామకృష్ణ, జి.వెంకటరమణ, బాస్‌ వ్యవస్థాపకులు పీటీఎం.శివప్రసాద్‌, ఎమ్మార్పీఎస్‌ నరేంద్రబాబు, శ్రీచందు, ఎస్సీ ఎస్టీ నాయకులు బొజ్జప్ప, దివాకర్‌, పోతపోలు రెడ్డప్ప, పి.వెంకటరమణ, దళిత సంఘర్షణ సంస్థ చిన్నప్ప, బి.రమణ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement