టిన్నర్‌ తాగి రెండేళ్ల చిన్నారికి అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

టిన్నర్‌ తాగి రెండేళ్ల చిన్నారికి అస్వస్థత

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

మదనపల్లె టౌన్‌: తాగే నీళ్లు అనుకుని రెండేళ్ల చిన్నారి టిన్నర్‌ తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. గురువారం కురబలకోట మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. అంగళ్లు కు చెందిన లక్ష్మి కుమార్తె లిఖిత ప్రియ(2) ఇంట్లో ఆడుకుంటూ టిన్నర్‌ బాటిల్‌ కనిపించడంతో నీళ్లు అనుకుని పొరబటున తాగేసింది. చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు గమనించి వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్యం కుదుట పటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉరివేసుకొని టీచర్‌ ఆత్మహత్య

లక్కిరెడ్డిపల్లి: మండలంలోని కోనంపేట గ్రామానికి చెందిన ఎలుగోటి రామకృష్ణ (55) అనే వ్యక్తి మనస్థాపానికి గురై గురువారం ఉదయం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లక్కిరెడ్డిపల్లి పోలీసులు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతుడు రామకృష్ణ ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండేవాడు. ఇటీవల పాఠశాలలో పని చేయడం మానేసి ఇంటివద్దే ఉండేవారన్నారు. ప్రతిరోజూ పొలం వద్దకు వెళ్లి పొలం పనులు చూసుకునేవడాడు. తన ఆరోగ్య పరిస్థిత సరిగా లేకపోవడంతో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఇంటికి వచ్చి ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నట్లు బంధువులు తెలిపారని పోలీసులు తెలియజేశారు.

కుటుంబ సమస్యలతో వ్యక్తి..

జమ్మలమడుగు రూరల్‌: పట్టణంలోని దిగువపట్నం కాలనీకి చెందిన డేరంగుల సుధాకర్‌ (40) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దిగువపట్నం కాలనీకి చెందిన సుధాకర్‌ ట్రాక్టర్‌ డ్రైవరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కుటుంబ సమస్యలు అధికమయ్యాయి. దీంతో బుధవారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తాళ్లప్రొద్దుటూరులో చోరీ

కొండాపురం: మండల పరిధి తాళ్లప్రొద్దుటూరులోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్న షేక్‌ అమీర్‌బాష ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఎస్‌ఐ మంజునాథ గురువారం తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన షేక్‌. అమీర్‌బాష ఓ వివాహానికి వెళ్లాడు. బుధవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేరు ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి తులం చెంపచారీలు ,రూ. లక్ష నగదు దొంగలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement