బైక్‌, ఇన్నోవా ఢీ: ఇద్దరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బైక్‌, ఇన్నోవా ఢీ: ఇద్దరు దుర్మరణం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

మదనపల్లె టౌన్‌: మదనపల్లె మండలంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైకును ఢీకొనడంతో ఇద్దరు అక్కడి అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. కొత్తవారిపల్లె పంచాయతీ, పూలవాండ్లపల్లెకు చెందిన శేషాద్రి రమణ(36), సీటీఎం ఇండియన్‌ బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని స్కూటీలో పూలవాండ్లపల్లెకు వెళుతుండగా, కంకర ఫ్యాక్టరీ వద్ద గుర్రంకొండకు వెళ్లి తిరిగి మదనపల్లెకు వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొని అక్కడి నుంచి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటరిస్టు శేషాద్రిరమణతో పాటు కారులోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన ఇషాక్‌ (13) అనే బాలుడు చనిపోయాడు. కారులో ఇరుక్కుపోయిన మదనపల్లె దేవతా నగర్‌కు చెందిన జావీద్‌ (22), ముజీబ్‌ నగర్‌కు చెందిన అస్లాం (19), ముబారక్‌(27) లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెలికితీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జావీద్‌, అస్లాంల పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు వీరిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు

మృతిచెందిన శేషాద్రి రమణ, ఇషాక్‌

Advertisement
 
Advertisement
Advertisement