ప్రతి మహిళా సభ్యురాలికి సీ్త్రనిధి రుణం | - | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళా సభ్యురాలికి సీ్త్రనిధి రుణం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

తంబళ్లపల్లె: వెలుగు మహిళా సంఘాలలోని ప్రతి మహిళా సభ్యురాలికి సీ్త్ర నిధి రుణం పంపిణీ చేయాలని సీ్త్ర నిధి కడప జోనల్‌ మేనేజర్‌ వెంకటప్రసాద్‌ సూచించారు. గురువారం ఆయన వెలుగు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీ్త్ర నిధి రుణాల పంపిణీలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని రికవరీలో మూడోస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో సీ్త్ర నిధి రుణాల పంపిణీ 12వేల కోట్లు లక్ష్యం కాగా జిల్లాలో 508 కోట్లు లక్ష్యమన్నారు. రుణాలు పొందిన మహిళా సభ్యులు డిజిటల్‌ పేమెంట్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లిస్తారన్నారు. ఎక్కడ అవకతవకలు అవినీతికి చోటు ఉండదన్నారు. కార్యక్రమంలో ఏజీఎం సంతోష్‌కుమార్‌, ఏపిఎం గంగాధర్‌, సీ్త్ర నిధి మేనేజర్‌ అమరావతి, సీసీలు ఆదిలక్ష్మి, నరసింహులు, రమణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement