తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అల్లసాని
ఎర్రగుంట్ల : తెలుగు భాష ఔన్నత్యాని, గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అల్లసాని పెద్దనామాత్యులని పంపా క్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామి తెలిపారు. సోమవారం ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో వెలసిన పూరతమైన శివాలయం ఆవరణలో అల్లసాని పెద్దనామాత్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తపు రామ్మోహన్‌రెడ్డి, కళావతమ్మలు అల్లసాని పెద్దనామాఽత్యుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ అల్లసాని పెద్దన్న నడయాడిన పెద్దనపాడు గ్రామంలోని శివాలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని కొనియడారు. కృష్ణదేవరాయుల కాలంలోని అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడుగా పెద్దనామాత్యులు పేరుపొందారన్నారు. విగ్రహ దాత కొత్తపురామ్మోహన్‌రెడ్డి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కొనియడారు. అనంతరం కవి సమ్మేళనం కూడా నిర్వహించారు. అలాగే కొత్తపు గంగా చైతన్య కూమార్‌రెడ్డి విగ్రహాన్ని కూడా పెద్దలు ఆవిష్కరించారు.
పెద్దనపాడు శివాలయంలో అల్లసాని విగ్రహం ఆవిష్కరణ
తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అల్లసాని


