పండుగ వేళ.. క్రీడల హేల
పుంగనూరు : పట్టణంలోని గూడూరుపల్లె వద్ద ఉన్న జగనన్న టిడ్కో కాలనీలోని లబ్ధిదారులతో కలసి సంక్రాంతి సంబరాలను ఆదివారం నిర్వహించారు. కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో టిడ్కో ఇన్‌చార్జ్ రవీన్‌కుమార్‌రెడ్డి మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు, పరుగు పందెల పోటీలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని నారాయణి ఫౌండేషన్ ప్రతినిదులు హేమంత్ రాయల్ ఆధ్వర్యంలో స్థానిక బీఎంఎస్ క్లబ్‌లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. పొంగళ్లు వండి, భోగి మంటలు వేసి, సంక్రాంతి పాటలు పాడుతూ సంబరాలు జరిపారు.
ఆటలతోనే ఐక్యత
చౌడేపల్లె : ఆటలతోనే యువకుల్లో ఐక్యత చేకూరుతుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త దివ్యశ్రీ ఇండ్రస్ట్రీయల్ ఎండీ భాస్కర్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని దాదేపల్లె సమీపంలోని రాజులూరు వద్ద ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణంలో ఆదివారం కేపీఎల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (క్షత్రియ ప్రీమియర్ లీగ్) 11 యేళ్ళుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సీజన్ క్రికెట్ పోటీలను పారిశ్రామిక వేత్తలు సుదర్శనరాజు, ఎన్.పురుషోత్తంరాజు, వెంకటరమణరాజు, లక్ష్మిపతిరాజు, పి.పురుషోత్తంరాజు, రవిరాజు తదితరులు కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో వక్తలు ప్రసంగించారు. వివిధ ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు తమ క్రీడలను మరుగున వేయకుండా ప్రదర్శించాలని సూచించారు. క్షత్రియుల సమస్యలను గుర్తించి వారికి చేయూత నివ్వడానికి ముందుకురావాలని సూచించారు. అనంతరం ప్రాంగణంలోని జెండాను ఆవిష్కరించి బ్యాటింగ్‌తో క్రీడను ప్రారంభించారు. క్షత్రియ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పొటీల్లో పాల్గొనడానికి వివిధ గ్రామాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. మూడు రోజులపాటు సాగే క్రికెట్ పోటీల్లో తలపడడానికి మొత్తం 13 టీంలు తలపడనున్నాయి.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
కేవీపల్లె : మండలంలోని కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో గర్నిమిట్ట యల్లమ్మ తల్లి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహేష్‌రెడ్డి, ఆనంద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఈ నెల 15వ తేదీ వరకు మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో విజేత జట్టుకు రూ. 15 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచే జట్టుకు రూ. 10 వేలు తోపాటు ప్రతిభ చూపిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది సీరిస్, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ బహుమతులు ఇస్తామని తెలిపారు.
పండుగ వేళ.. క్రీడల హేల
పండుగ వేళ.. క్రీడల హేల


