కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూజలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయ అధికారులు భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
కిటకిటలాడిన బోయకొండ


