సంక్రాంతి క్రికెట్ టోర్నీ విజేత ‘మదనపల్లె పోలీస్’
మదనపల్లె రూరల్ : జీవీఎస్సీఎస్ సొసైటీ, వాల్మీకిపురం సహకారంతో అన్నమయ్య క్రీడాభారతి ఆధ్వర్యంలో మదనపల్లె అఫిషియల్స్ సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. మదనపల్లె జర్నలిస్ట్స్, పోలీస్, రెవెన్యూ, జీవీఎస్సీఎస్ టీచర్స్, సర్వేపల్లె రాధాకృష్ణ, మదనపల్లె మున్సిపాలిటీ పేరుతో మొత్తం 6 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో మదనపల్లె పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఫైనల్ పోటీల్లో పోలీస్ జట్టు 10 ఓవర్లలో 49 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ దిగిన మదనపల్లె మున్సిపల్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 47 పరుగులు చేసింది. పోటీల్లో గెలుపొందిన జట్టుకు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, జీవీఎస్సీఎస్ సొసైటీ ఫౌండర్ జీ.శ్రీధర్‌కుమార్ చేతులమీదుగా మదనపల్లె అఫీషియల్స్ ఇన్విటేషన్ సంక్రాంతి క్రికెట్ కప్‌ను అందించారు. మదనపల్లె డీఎస్పీ కే.మహేంద్ర పోలీస్‌జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్‌బాబు, వైస్ ప్రెసిడెంట్ విష్ణుచైతన్య, అన్నమయ్యజిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాజారమేష్, జీవీఎస్సీఎస్ మెంబర్లు ఉదయ్, నాగరాజ, రంజిత్, కిల్లా నాగరాజ, నవీన్, స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజ పాల్గొన్నారు.
హోరాహోరీగా సాగిన జీవీఎస్సీఎస్ అఫిషియల్స్ క్రికెట్ పోటీలు


