ట్రాన్స్‌పోర్ట్ కంటైనర్‌ను ఢీకొని స్కూటరిస్టు మృతి
● కంటైనర్ క్యాబిన్‌లో చెలరేగిన మంటలు
● పరారీలో కంటైనర్ డ్రైవర్
రాయచోటి టౌన్ : బ్యాటరీల లోడుతో వెళ్లుతున్న కంటైనర్‌ను మాధవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (58) శుక్రవారం అనే వ్యక్తి ఢీకొన్నాడు. ఈ దర్ఘటనలో శ్రీనివాసులు అక్కడిక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో స్కూటర్‌ను కంటైనర్ లాకెళ్లడంతో స్కూటర్‌లో ఉన్న పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు కంటైనర్ క్యాబిన్‌లోకి చొచ్చకోవడంతో పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన కంటైనర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ విషయం స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ స్టేషన్ అధికారి వెంకట్రామిరెడ్డి తన సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేసి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. కంటైనర్‌లో ఉన్న సుమారు రూ. 25–30 లక్షల విలువ చేసే అమరన్ బ్యాటరీలు కాలిపోకుండా, నష్టం జరగకుండా చేశా రు. అనంతరం రాయచోటి ట్రాఫిక్ సీఐ కులాయప్ప తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారించి కేసు నమోదు చేశారు.
ట్రాన్స్‌పోర్ట్ కంటైనర్‌ను ఢీకొని స్కూటరిస్టు మృతి


