ప్రభుత్వ సొమ్మే కదా..?
● సచివాలయంలో ఎలక్ట్రికల్‌బైక్‌కు చార్జింగ్
● ఆరునెలలుగా ఇదే తంతు
చౌడేపల్లె : ప్రభుత్వ సొమ్మే కదా...? మనం కూడా వినియోగించుకొంటే అడిగేవారెవరున్నారు..? అనుకొన్నారేమో చౌడేపల్లె మండలం కాగతి సచివాలయంలో పనిచేస్తున్న వెల్‌ఫేర్ అసిస్టెంట్. ఆ ఉద్యోగి రోజూ విధులకు ఎలక్ట్రికల్ బైక్‌లో వస్తుంటారు. ఇంటి వద్ద చార్జింగ్ పెట్టకుండా ఏకంగా సచివాలయం వద్ద కు బైక్‌ను తెచ్చి చార్జింగ్ పెట్టుకొని ఎంచెక్కా.. షికారుతోపాటు ఇంటికి వెళ్ళడం గత ఆరునెలలుగా సాగుతోంది. ఇంటి వద్ద కరెంటు బిల్లు ఆదా చేయాలనుకున్నారేమో కానీ.. ప్రభుత్వ సొమ్ముతో తమకున్న ఎలక్ట్రికల్ బైక్‌కు పవర్‌ను పక్కాగా వాడేస్తున్న దృశ్యం శుక్రవారం సాక్షి కెమెరాకు చిక్కింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మొగిల్‌రెడ్డిను విచారించగా ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాదని బదులిచ్చారు.


