పోగొట్టుకున్న పర్సు అందజేత
వాల్మీకిపురం : స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద ఒక వ్యక్తి తనకు దొరికిన పర్సును సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించి మానవత్వం చాటుకున్నాడు. శుక్రవారం స్థానిక గ్రోమోర్‌లో పని చేస్తున్న మేనేజర్ రెడ్డి శేఖర్ పర్సు పోగొట్టుకున్నాడు. పర్సును దారిలో వెళ్తున్న సికిందర్‌కు దొరకడంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌లో అందించారు. విచారించిన ఎస్‌ఐ తిప్పేస్వామి పర్సు గ్రోమోర్ మేనేజర్ రెడ్డి శేఖర్‌ది అని తెలియడంతో అతనికి పర్సును అందించారు. పర్సులో నగదు, ఎటీఎం కార్డులు ఉన్నాయి.
విద్యార్థికి తీవ్ర గాయాలు
బి.కొత్తకోట : మండలంలోని బడికాయలపల్లె పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని హరిక (7)ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలకు గురైంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా వెనుకవైపు వచ్చిన వాహనం ఢీకొని వె వెళ్లిపోవడంతో హరికను స్థానిక సీహెచ్‌సీకి తరలించగా కాలు విరిగినట్టు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న సీఐ గోపాల్‌రెడ్డి, ఎంఈఓ రెడ్డిశేఖర్ బాలికను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు.
వేర్వేరు ఘటనల్లో
ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుంగనూరు రెడ్డెమ్మక్వార్టర్స్‌కు చెందిన మహమ్మద్ హుస్సేన్ భార్య షాహీనా(40) కుటుంబసమస్యలతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఐసీయూ విభాగంలో చికిత్సలు అందిస్తున్నారు. మదనపల్లె పట్టణం రామారావుకాలనీకి చెందిన రామాంజులు కుమారుడు వెంకటరెడ్డి(33) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది నీరుగట్టువారిపల్లె సమీపంలోని కాట్లాటవారిపల్లె రోడ్డులో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక ప్రశాంత్ నగర్‌లో 2024లో చోరీకి పాల్పడిర నల్లమూతుల సురేష్ అనే వ్యక్తిని శుక్రవారం కదిరి రింగురోడ్డు సమీపంలో అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ సీతారాంరెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి 30 గ్రాములు బంగారు స్వాధీనం చేసుకున్నామన్నారు.
పోగొట్టుకున్న పర్సు అందజేత


